Spoken English Online Courses 4th Day || రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ నాలుగవ రోజు

  నాలుగవ రోజు (4th Day)

Hai Friends...!

చిన్న చిన్న సంభాషణలు (Phrases)

ఇంగ్లిష్‌ భాషలోని కొన్ని ముఖ్యమైన వ్యాక్యాలు వ్యాకరణానికి పెద్దగా సంబంధం లేకుండా వాడతారు. ఉదాహరణకు,
Yes, sir! (అవును, సార్!), No, sir! (కాదు, సార్!) Very good, sir! (చాలా బాగా, సార్!)
ఈ తరహా వ్యాక్యాలు మాట్లాడే సమయంలో తరచుగా ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన వాక్యాలు అందించబడ్డాయి. వీటిని ప్రాక్టీస్‌ చేయడం వల్ల, ఇంగ్లీష్‌ సంభాషణల్లో తేలికగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

A

  1. వెంటనే వస్తున్నాను - Just coming.
  2. చాలా బాగుంది - Very well.
  3. మంచిది/బాగుంది - Fine./Very good.
  4. మీ ఇష్టమున్నట్టు - As you like./As you please.
  5. ఇంకేదైనా? - Anything else?
  6. చాలు - That’s enough.
  7. ఈ గౌరవానికి ధన్యవాదాలు - Thanks for this honour.
  8. సరే - O.K.
  9. ఎందుకు కాదు? - Why not?
  10. అంతకంటే కాదు - Not a bit.
  11. జాగ్రత్త - Take care.
  12. రేపు కలుద్దాం - See you tomorrow.
  13. ఖచ్చితంగా - Yes, by all means!
  14. చాలా ఎక్కువైంది - That is too much.
  15. అవును, సార్! - Yes, sir!
  16. కాదు, అసలు కాదు - No, not at all.
  17. పరవాలేదు - Never mind./Doesn’t matter.
  18. ఇంకేమీలేదు - Nothing else.
  19. ప్రత్యేకం ఏమీ లేదు - Nothing special.
  20. స్వాగతం! - Welcome!
  21. నిశ్చయంగా నమ్మండి - Rest assured.
  22. చాలా రోజులుగా కనబడలేదు - Not seen since a long time.
  23. శుభాకాంక్షలు! - Good bye!
  24. వీడ్కోలు! - Bye bye!
  25. అంతకంటే కాదు! - Not the least!

ఇవి రోజువారీ సంభాషణల్లో ఉపయోగపడే ముఖ్యమైన వాక్యాలు. ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం పొందేందుకు వీటిని పదే పదే ప్రాక్టీస్‌ చేయండి.

ఆజ్ఞా మూడక వాక్యాలు (Sentences of Command/Order)

  1. నా మాట విను అగను - I say stop.
  2. చెప్పు - Speak.
  3. విను - Listen.
  4. ఇక్కడే వేచిఉండు - Wait here.
  5. ఇక్కడ రా - Come here.
  6. ఇక్కడ చూడు - Look here.
  7. ఇది తీసుకో - Take it.
  8. దగ్గరగా రా - Come near.
  9. బయటే వేచిఉండు - Wait outside.
  10. పైకి వెళ్లు - Go up.
  11. కిందకి వెళ్లు - Go down.
  12. క్రిందకి దించు - Get off.
  13. సిద్ధంగా ఉండు - Be ready./Get ready.
  14. అలిగి ఉండకు - Keep quiet.
  15. జాగ్రత్తగా ఉండు - Be careful./Be cautious.
  16. నెమ్మదిగా నడువు - Go slowly./Walk slowly.
  17. వెంటనే వెళ్లు - Go at once.
  18. ఇక్కడ ఆగు - Stop here.
  19. నేరుగా వెళ్లు - Go straight.
  20. వెళ్ళిపో - Go away./Get out.

గుర్తుంచుకోండి (Remember):

  • ఆజ్ఞా మూడక వాక్యాల్లో ‘You’ (నీవు) అర్థం స్వయంగా తెలుస్తుంది.
  • మర్యాదతో చెప్పాలంటే ‘Please’ ఉపయోగించాలి.
  • ఉదాహరణ: "Please stop." (దయచేసి ఆగండి).
  • మరింత మర్యాదతో చెప్పాలంటే "Kindly" ఉపయోగించాలి.
  • ఉదాహరణ: "Kindly grant me leave." (దయచేసి నాకు సెలవు ఇవ్వండి).

Comments